ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆత్మహత్య చేసుకున్న పెళ్లికూతురు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 19, 2023, 04:09 PM

అనంతపురం జిల్లా, కణేకల్లు లో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే... కణేకల్లు దిగువగేరిలో ఉండే ఆదిలక్ష్మి కుమార్తె గొల్ల మహాదేవి (19) గురువారం రాత్రి ఇంట్లోని బాత్ రూంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నెల 19, 20వ తేదీలలో మహాదేవి పెళ్లి కర్నూలు జిల్లాలోని చిప్పగిరి మండలం నగరడోనకు చెందిన యువకుడితో జరగాల్సి ఉంది. ఈమె తండ్రి పాపన్న గతంలోనే మరణించాడు. కడుపునొప్పి తాళలేక మహాదేవి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com