ఏ పదవికైనా అర్హత ఉండాలని, ఐదేళ్లు చదివితేనే డాక్టర్ అవుతారని, అలాగే పదేళ్లు రాజకీయాల్లో కొనసాగాకే సీఎం పదవికి తాను సంసిద్ధత వ్యక్తం చేశానని, ప్రజలు కూడా సీఎంకి అర్హుడినని భావిస్తేనే తన ప్రయత్నం ఫలిస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. ఇక్కడ వ్యక్తిగతంగా తనకు ఫాలోయింగ్ ఉందని, అలాగే జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా ప్రజల్లో పట్టు ఉండాలని, విశ్వాసం పెంచుకోవలసి ఉందని అన్నారు.