రాష్ట్రవ్యాప్తంగా నేడు జరిగిన ఉపఎన్నికల్లో వాలంటీర్ల జోక్యాన్ని నిలువరించడంలో విఫలమైన కలెక్టర్లు, పోలీస్ అధికారులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. వైసీపీ నేతల ప్రలోభాలు, బెదిరింపులు, అక్రమాలు, అరాచకాల్ని, వాలంటీర్ల జోక్యాన్నికూడా ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ ముందుంచుతామన్నారు. ప్రజలకిచ్చిన హామీలు 98 శాతం నెరవేర్చామని, సంక్షేమ పథకాలతో వారి మనసులు చూరగొన్నామంటున్న అధికార పార్టీ.. సాధారణ పంచాయతీ ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు బరితెగించిందని ప్రశ్నించారు.