కర్నూలు జిల్లా, కోవెలకుంట్ల మండలంలోని కలుగొట్ల గ్రామంలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి మహాశక్తి పథకం ప్రచారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేసి కరపత్రాలు పంపిణీ చేశారు. చంద్రబాబు విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని పథకాల గురించి బీసీ జనార్దన్‌రెడ్డి మహిళలకు వివరించారు. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ప్రజలకు అన్యాయాలు, చేస్తున్నాడని తెలియజేసారు. పేద ప్రజల కోసం టీడీపీ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా రైతులకు అన్నదాత పథకం కింద సంవత్సరానికి రూ.20 వేలు, నిరుద్యోగులకు యువగళం నిధి కిం ద నిరుద్యోగ భృతి సంవత్సరానికి రూ.36 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత సౌకర్యం, సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇవ్వనున్నట్లు మేనిఫెస్టో ప్రకటించారన్నారు. తల్లికి వందనం కింద చదువుకునే ప్రతి ఒక్కరికి సంవత్సరానికి రూ.15వేలు, అలాగే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున సంవత్సరానికి రూ.18వేలు చొప్పున మహిళలకు ఆర్థికంగా సాయం అందించనున్నట్లు తెలిపారు.