రాష్ట్రంలోని యూనివర్సిటీల్లోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని యూనివర్సిటీల వీసీలు, ఉన్నత విద్యాశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రూ.230 కోట్లు కేటాయించాల్సిందిగా సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పి మణివణ్ణన్ను ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ఫోన్లో ఆదేశించారు. యూనివర్సిటీల్లోని అన్ని వర్గాలకు చెందిన ప్రతి విద్యార్థికి ల్యాప్టాప్లు పంపిణీ చేయాలి. రానున్న రోజుల్లో ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.