ముంబైలోని కుర్లాలో కాంపౌండ్ వాల్ కూలిపోవడంతో 18 ఏళ్ల యువతి సోమవారం ప్రాణాలు కోల్పోయింది. కుర్లాలోని సుభాష్ నగర్ ప్రాంతంలో ఈ దురదృష్టకర సంఘటన జరగ్గా, వైష్ణవి ప్రజాపతి అనే యువతి గాయాలపాలై మృతి చెందింది. గోడ కూలడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. మరోవైపు ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ముంబయి నగరంలో గోడ కూలిపోయిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ విషాద సంఘటన ఆ ప్రాంతంలోని ఇతర పాత నిర్మాణాల గురించి నివాసితులలో ఆందోళనకు దారితీసింది. జూన్ 2022లో, కుర్లాలో 4-అంతస్తుల నివాస భవనం కూలిపోవడంతో 19 మంది మరణించారు.ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.