రాజమండ్రి నగరంలోని ఎస్. కే. వి. టి పాఠశాలను ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న మౌలిక వసతులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అలాగే విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంట ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa