ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పలు కారణాల రిత్యా 52 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే....మరికొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 22, 2023, 10:18 PM

 ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. దక్షిణ మధ్య రైల్వే భారీగా రైళ్లను రద్దు చేసింది. విజయవాడ-గుణదల సెక్షన్‌లో నాన్‌- ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా మంగళవారం విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశారు. మొత్తం 52 రైళ్లను రద్దు చేయగా, 18 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రైళ్లు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. హైదరాబాద్‌- విశాఖపట్నం మార్గంలో ఉన్న జన్మభూమి(12805-12806), గరీబ్‌రథ్‌ (12739-12740) సహా విశాఖ- చెన్నై, తిరుపతి- భువనేశ్వర్‌, హైదరాబాద్‌- కటక్‌ వంటి రైళ్లు సైతం రద్దయ్యాయి.


రాజమండ్రి-విజయవాడ (07767), విజయవాడ-రాజమండ్రి (07768), విజయవాడ-రాజమండ్రి (07459), రాజమండ్రి-విజయవాడ (07460) రైళ్లు రద్దయ్యాయి. ఈ నెల 23 వరకు కటక్‌-హైదరాబాద్‌ (07166) రైలును రద్దు చేశారు. ఈనెల 27 వరకు కాకినాడ టౌన్‌-లింగంపల్లి (12775), లింగపల్లి-కాకినాడ టౌన్‌ (12776), విశాఖ పట్నం-సికింద్రాబాద్‌ (12783), సికింద్రాబాద్‌-విశాఖపట్నం (12784) రైళ్లు రద్దయ్యాయి. విశాఖ పట్నం-లింగంపల్లి (12805) రైలును 29వ తేదీ వరకు.. లింగంపల్లి-విశాఖపట్నం (12806) రైలును ఈనెల 30 వరకు.. విశాఖపట్నం-మహబూబ్‌నగర్‌ (12861) రైలును ఈనెల 29 వరకు.. మహబూబ్‌ నగర్‌-విశాఖపట్నం (12862)ను ఈనెల 30 వరకు రద్దు చేశారు.


అలాగే సంబల్‌పూర్‌-నాందేడ్‌ (20809)ను ఈనెల 28 వరకు.. నాందేడ్‌-సంబల్‌పూర్‌ను 29 వరకు, విశాఖపట్నం-నాందేడ్‌ (20811)ను 29 వరకు రద్దయ్యాయి. నాందేడ్‌-విశాఖపట్నం (20812) రైలును 30 వరకు, విశాఖపట్నం-విజయవాడ (22701) రైలును ఈనెల 29 వరకు రద్దు చేశారు. విశాఖపట్నం-తిరుపతి (22707) రైలును ఈనెల 31 వరకు, తిరుపతి-విశాఖపట్నం (22708) రైలును ఈనెల 30 వరకు, విశాఖపట్నం-తిరుపతి (08583) రైలును ఈనెల 28 వరకు, తిరుపతి-విశాఖపట్నం (08584) రైలును ఈనెల 29 వరకు, కాకినాడ టౌన్‌-లింగంపల్లి (07445) రైలును ఈనెల 28 వరకు, లింగంపల్లి-కాకినాడ టౌన్‌ (07446) రైలును ఈనెల 29 వరకు రద్దయ్యాయి.


విశాఖపట్నం-చెన్నై సెంట్రల్‌ (22801) రైలును ఈనెల 25 వరకు, చెన్నై సెంట్రల్‌-విశాఖపట్నం (22802) రైలును ఈనెల 26 వరకు, బీబీఎస్‌-తిరుపతి (02809) రైలును ఈనెల 26 వరకు, తిరుపతి-జీబీఎస్‌ (02810) రైలును ఈనెల 27 వరకు,ధర్మవరం-మచిలీపట్నం (07096) రైలును ఈనెల 29 వరకు, మచిలీపట్నం-ధర్మవరం (07095) రైలును ఈనెల 28 వరకు రద్దు చేశారు. గుంటూరు-విశాఖపట్నం (17239), విశాఖపట్నం-గుంటూరు (17240), గుంటూరు-నర్సాపూర్‌ (17281), నర్సాపూర్‌-గుంటూరు (17282), గుంటూరు-దోనె (17228), దోనె- గుంటూరు (17227), మచిలీపట్నం-యశ్వంత్‌పూర్‌ (17211), తిరుపతి-మచిలీపట్నం (17212), గుంటూరు-రాయగడ (17243), రాయగడ-గుంటూరు (17244), తిరుపతి-కాకి నాడ పోర్టు (17249), కాకినాడ టౌన్‌-తిరుపతి (17250), విజయవాడ-కాకినాడ పోర్టు (17257), కాకినాడ పోర్టు-విజయవాడ (17258), కడప-విశాఖపట్నం (17487), విశాఖపట్నం-కడప (17488) విశాఖపట్నం-విజయవాడ (12717), విజయవాడ-విశాఖపట్నం (12718), హైదరాబాద్‌-కటక్‌ (07165) రైళ్లను మంగళవారం రద్దు చేశారు.


విజయవాడ-నర్సాపూర్‌ (17269), విజయవాడ-నర్సాపూర్‌ (07861), విజయవాడ-మచిలీపట్నం (07898), మచిలీపట్నం-విజయవాడ (07867), మచిలీపట్నం-విజయవాడ (07899), మచిలీపట్నం-విజయవాడ (07770), నర్సాపూర్‌-విజయవాడ (17270), మచిలీపట్నం-విజయవాడ (07896), విజయవాడ-నర్సాపూర్‌ (07862), విజయవాడ-మచిలీపట్నం (07769), నర్సాపూర్‌-గుంటూరు (07281), నర్సాపూర్‌-విజయవాడ (07863), మచిలీపట్నం-విజయవాడ (07870), విజయవాడ-మచిలీపట్నం (07866), విజయవాడ-భీమవరం (07877), విజయవాడ-మచిలీపట్నం (07895), విజయవాడ-భీమవరం (07283), భీమవరం-విజయవాడ (07865) రైళ్లను విజయవాడ-రామవరప్పాడు మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వేశాఖ సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa