నక్కపల్లి మండలం కాగిత గ్రామంలో వరి నాట్లు ఎలా వేయాలి అనేదానిపై బుధవారం ఏవో ఉమా ప్రసాద్ అవగాహన కల్పించారు. వర్షా బావ పరిస్థితులలో నీటి వనరులు లేని పొలాల్లో వరిని ఎలా వెదజల్లాలో తెలియజేశారు. ఇలా వరి నాటడం వల్ల దాదాపుగా రూ 5000 ఖర్చు మిగులుతుందని చెప్పారు. వరి నారుమడులను బతికించుకోవడం, నీటి తడులను అందజేయడంపై అవగాహన కల్పించారు. ఆయన వెంట ఏ ఈ ఓ సత్యనారాయణ రైతు భరోసా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.