ఢిల్లీ విమానాశ్రయంలో బుధవారం పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి బెంగాల్ బగ్ దోరాకు వెళ్తున్న ఫ్లయిట్ టేకాఫ్ సమయంలో అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానం ల్యాండింగ్ కానుంది. ఒకేసారి రెండింటికీ సిగ్నల్స్ ఇవ్వడంతో రన్ వేపై రెండూ ఢీకొనే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఏటీసీ ఆదేశాలతో చివరి క్షణాల్లో టేకాఫ్ నిలిపేశారు. దీంతో త్రుటిలో ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు.