అమృత్‌సర్‌లో ముగ్గురు డ్రగ్స్ అక్రమ రవాణాదారులను అరెస్టు చేసిన తర్వాత 41 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పంజాబ్ పోలీసులు బుధవారం తెలిపారు. ఈ సీజ్‌తో పోలీసులు సరిహద్దు దాటి డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవ్ యాదవ్ తెలిపారు.ట్రాన్స్ బోర్డర్ నార్కోటిక్ నెట్‌వర్క్‌లో ప్రమేయం ఉన్న ప్రధాన కింగ్‌పిన్‌ను అరెస్టు చేశారు అన్నారాయన. ఈ మేరకు కేసు నమోదు చేశామని, బ్యాక్వర్డ్, ఫార్వార్డ్ లింకేజీల కోసం దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.