ఇస్రో శాస్త్రవేతలను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసలతో ముంచెత్తారు. చంద్రయాన్-3 విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. ఈ రోజు అద్భుతమైన విజయం సాధించినందుకు ఇస్రో బృందానికి అభినందనలు అని, నిర్దేశించిన చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయిందని, ఇది మన శాస్త్రవేత్తల కష్టఫలం, అలాగే దశాబ్దాల మన కృషి ఫలితమని పేర్కొన్నారు. 1962 నుండి అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ కొత్త ఆవిష్కరణలు చేపడుతోందని, కలలుగనే యువతకు స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు.