వరల్డ్ కప్ 2023 మ్యాచ్‌ల టికెట్లు ‘బుక్ మై షో’లో విక్రయించడానికి బీసీసీఐ నిర్ణయించింది. ఆగస్టు 24, 29 తేదీల్లో సాయంత్రం 6 గంటల నుంచి మాస్టర్‌కార్డ్ ప్రీ-సేల్‌తో టికెట్ల విక్రయాలు మొదలుకానున్నాయి. వార్మప్ మ్యాచ్‌లు మినహా అన్నింటికీ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి మాస్టర్ కార్డ్ ప్రీ-సేల్ ద్వారా సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ల టికెట్లను కొనుగోలు చేయవచ్చు.