అద్దంకి నియోజకవర్గం పేరాయపాలెంలో 2009లో జరిగిన హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు, ఆరుగురికి మూడేళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఒంగోలు న్యాయమూర్తి సంచలన తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం తెలిపారు. ఎన్నికల సందర్భంగా చెన్నుపాటి రమేష్ ను ప్రత్యర్థ పార్టీకి చెందిన జాగర్లమూడి సత్యనారాయణ, శీను, హనుమంతరావు, రామాంజనేయులు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, నెల్సన్ రావు, పుట్ట శ్రీనివాసరావు, వలేటి శ్రీనివాసరావు, వలేటి సుబ్బారావులు హతమార్చినట్లు చెప్పారు.