గ్రామాలలో సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకే గడపగడపకు కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మిరియం పల్లి గ్రామంలో శనివారం రెండో రోజు గడపగడప కార్యక్రమంలో ఆయన పాల్గొని సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.