రంగం రాష్ట్ర ప్రథమ మహాసభలు సెప్టెంబరు 9, 10వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు విశ్రాంత కర్నూలు కలెక్టర్ బలరామయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ బంగ్లాలో విశ్రాంత కలెక్టర్ చేతుల మీదుగా రాష్ట్ర మహాసభల పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రంగం రాష్ట్ర అధ్య క్షుడు కరుణాకర్బాబు మాట్లాడుతూ..... పదేళ్ల నుంచి రంగం ప్రజా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత కోసం పోరాడుతుందన్నారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల ప్రతినిధులతో ప్రథమ మహాసభలు కర్నూలులో జరపాలని నిర్ణయించడం అభినందనీయ మన్నారు. కార్యమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య, డాక్టర్ అమరేంధ్ర నాథరెడ్డి పాల్గొన్నారు.