కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డిపై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే కొత్త కోట ప్రకాష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడుమూరు నియోజకవర్గంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని హత్యా రాజకీయాలు, భూకబ్జాలు, బెదిరింపులు, ఇసుక, ఎర్రమట్టి అవినీతి, అక్రమాలకు కోట్ల హర్షవర్ధన్ పాల్పడుతున్నాడని ఆరోపించారు. కర్నూలు నగరంలోని తన నివాసంలో ప్రకాష్ రెడ్డి శుక్రవారం విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. ఆరు నెలల క్రితం జరిగిన టీడీపీ నాయకుడు కన్నూరు కురువ సిద్దన్న హత్య కేసులో కోట్ల హర్షవర్ధన్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. అందుకు తగిన వాయిస్ రికార్డులు తన వద్ద ఆధారాలతో సహా ఉన్నాయన్నారు. కోడుమూరులో అభంశుభం తెలియని ఓ సామాజికవర్గాన్ని తనగుప్పిట్లో పెట్టుకుని హత్యారాజకీయాలు, భూక బ్జాలు దౌర్జన్యాలు చేస్తూ ప్రజలను భయంభ్రయాంతులకు చేస్తున్నార న్నారు. కోడుమూరు వైసీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆదిమూలపు సతీష్, సంద్యా విక్రమ్ కుమార్, లోకేష్‌లను అనవసరంగా టికెట్ ఆశపెడుతూ వారి నుంచి డబ్బులు ఖర్చు చేయిండం సిగ్గుచేటన్నారు. చివరకు కుడా చైర్మెన్‌గా ప్రమాణా స్వీకార ఖర్చును చనుగొండ్ల శ్యామరావుకు భరించాడ న్నారు. అఫ్రూవల్ పరిమిషన్ ఇస్తే ప్రతి వెంచర్‌లో ఒక ప్లాట్లు కొంత డబ్బును తీసుకోవడం వాస్తవం కాదా? అని ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. నాలుగేళ్లలో రూ.60కోట్లు అక్రమంగా సంపాదించాడని, అవీనీతిలో కోట్ల హర్ష, ఎమ్మెల్యే సుధాకర్ పోటీ పడుతున్నారని ఆరోపించారు. సుధాకర్ రూ.6కోట్లు పెట్టి ఇళ్లు నిర్మిస్తే, హర్ష ఉల్చాల రోడ్డులో సుధాకర్‌కు పోటీగా రూ.7కోట్లు పెట్టి ఇంటిని నిర్మిస్తున్నాడన్నారు. ఎన్నికల డబ్బును స్వాహా చేసిన హర్షకు సజ్జల తప్ప సీఎం అపాయింట్‌మెంట్ దొరకదన్నారు. ఈ సమావేశంలో వైసీపీ మాజీ మండల కన్వీనర్ బోయవెంకటేష్ నాయుడు, లక్ష్మణ్ గౌడ్ ఉన్నారు.