టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ నాయకులు ఎమ్మిగనూరు, ఆదోని పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. శాంతిభద్రతలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని, వారిపై చర్య లు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో ఎమ్మి గనూరు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ మన్సూర్ భాషా, ఆదోనిలో పెద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.