ఇండియన్ స్మార్ట్‌సిటీ అవార్డ్సు 2022లో కాకినాడ స్మార్ట్‌సిటీ దేశంలోనే రెండవస్థానంలో నిలిచింది. పారిశుధ్య విభాగంలో చేపట్టిన పాలనా సంస్కరణలకుగాను కాకినాడ ఆకర్షణీయ నగరానికి ఈ గౌరవం దక్కింది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ కూనల్‌కుమార్‌శుక్రవారం ఢిల్లీలో ఈ అవార్డులను ప్రకటించారు. దేశవ్యాప్తంగా 100 స్మాట్‌సిటీలు ఉండగా ఈ అవార్డులకు 39 స్మార్ట్‌సిటీ సిటీలు పోటీ పడ్డాయి. 54 ప్రాజెక్టులను ఆ అవార్డుల కోసం పరిగణలోకి తీసుకున్నారు. పారిశుధ్య విభాగంలో చేపట్టిన పాలనా సంస్కరణలకుగాను ఇండోర్ దేశంలోనే ప్రథమస్థానాన్ని సాధించగా కాకినాడ స్మార్ట్‌సిటీ రెండవ స్థానాన్ని సంపాదించింది. ఆంధ్ర ప్రదేశ్‌లో విశాఖ, తిరుపతి, అమరావతి, కాకినాడ స్మార్ట్‌సిటీలు ఉండగా ఏపీ మొత్తం మీద కాకినాడకు మాత్రమే అవార్డు వచ్చింది. సెప్టెంబరు 27న ఇండోర్‌లో జరగనున్న స్మార్ట్‌సిటీల సదస్సులో రాష్టప్రతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును అందజేయనున్నారు. దేశంలోనే కాకినాడ స్మార్ట్‌సిటీ రెండవస్థానంలో నిలవడంలో కృషిచేసిన అధికారులు సిబ్బంది ఇతర ఉద్యోగులను కాకినాడ స్మార్ట్‌సిటీ సీవో, మేనేజింగ్ డైరెక్టర్, కమిష నర్ సీహెచ్.నాగనరసింహరావు అభినందించారు. ఇంటింటికీ తడిపొడి చెత్త సేకరణ, ఇతర పాలనా సంస్కరణలకుగాను ఈ అవార్డు దక్కిందన్నారు. ఇది కాకినాడకు దక్కిన మంచి గుర్తింపుగా ఆయన అభివర్ణించారు.