మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం మహిళల కోసం పలు హామీలను ప్రకటించారు. 'లాడ్లీ బెహనా' పథకం కింద మహిళలకు అందించే ఆర్థిక సహాయం రూ. 1,000 నుంచి రూ.1,250కి పెంచారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు, రూ.450కే వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.