ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోం వర్క్ చేయలేదని ముస్లింలందరినీ కొట్టాలని రెచ్చగొట్టిన ఉపాధ్యాయురాలు

national |  Suryaa Desk  | Published : Sun, Aug 27, 2023, 09:34 PM

హోం వర్క్‌ చేయని ఒకటో తరగతి విద్యార్థి పట్ల ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా టీచర్ వ్యవహరించిన తీరుపై తీవ్ర దుమారం రేగుతోంది. హోం వర్క్ చేయని బాలుడ్ని.. తోటి విద్యార్థులతో స్కూల్ హెడ్మాస్టర్ గంటకు పైగా సమయం కొట్టించినట్లు వార్తలు రావడం కలకలం రేపుతోంది. చెంపల మీద కొడితే ముఖం ఎర్రగా మారుతుంది.. కాబట్టి కడుపులో కొట్టండి అంటూ హిందూ విద్యార్థులను సదరు ఉపాధ్యాయురాలు రెచ్చగొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. యూపీలోని ముజఫర్‌పూర్‌ జిల్లా ఖుబ్బాపూర్‌లోని నేహా పబ్లిక్‌ స్కూల్‌లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళ్తే నేహా పబ్లిక్ స్కూల్ హెడ్మాస్టర్ తృప్తి త్యాగి.. హోం వర్క్ చేయలేదని, ఐదో ఎక్కం చెప్పలేకపోయాడంటూ ఓ విద్యార్థి (7)ని నిలబెట్టింది. అనంతరం తోటి విద్యార్థులందరూ అతడిని కొట్టాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆ బాలుడ్ని తోటి పిల్లలు కొడుతుంటే ‘ముస్లిం పిల్లలందరినీ కొట్టాలి.. ఇంకా ఎందుకు గట్టిగా కొట్టరు..? ఇప్పుడు ఎవరి వంతు?’ అంటూ ఆమె రెచ్చగొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. బాధితులు ఫిర్యాదు చేయకుండానే ఆమెపై కేసు పెట్టారు.


అయితే, వీడియోను ఎడిట్‌ చేశారని, తాను ఎవరి మనోభావాలను దెబ్బతిసే వ్యాఖ్యలు చేయలేదన్నారు. అంతేకాదు, దివ్యాంగురాలిని కావడం వల్లే విద్యార్థిని కొట్టాలని ఇతర విద్యార్థులకు కొట్టమని తృప్తి త్యాగి వివరణ ఇచ్చారు. ‘తరగతి గదిలో ఆ విద్యార్ధి బంధువు కూడా కూర్చున్నాడని, వీడియోను అతడే రికార్డు చేసి, వక్రీకరించాడన్నారు. ఆ విద్యార్ధి హోం వర్క్ చేయకపోవడంతోనే అలా చేశానని, జరిగింది తప్పేనని ఆమె అంగీకరించారు. ఇదేమంత పెద్ద విషయం కాదని ఆమె వ్యాఖ్యానించారు.


‘ఇది చిన్న సమస్య అని నేను రాజకీయ నాయకులకు చెప్పాలనుకుంటున్నాను.. రాహుల్ గాంధీతో సహా నేతలు ట్వీట్లు చేశారు.. అయితే అది అంత పెద్ద విషయం కాదు. ఇలాంటి రోజువారీ సమస్యలు వైరల్ అయితే ఉపాధ్యాయులు ఎలా బోధిస్తారు’ అని ఆమె అన్నారు. మరోవైపు, ఈ ఘటనపై రాజకీయంగా దుమారం రేపుతోంది. బీజేపీ విద్వేష దుకాణాన్ని పాఠశాలలకూ వ్యాపింపజేశారంటూ కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. బీజేపీ తొమ్మిదేళ్ల పాలన ఫలితం ఇది అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు.


బాలుడి తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేశామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా మేజిస్ట్రేట్ అరవింద్ మల్లప్ప బంగారి తెలిపారు. ‘నా కొడుకు వయస్సు 7 సంవత్సరాలు.. ఈ ఘటన ఆగస్ట్ 24న జరిగింది.. నా బిడ్డను విద్యార్థులను మళ్లీ మళ్లీ కొట్టేలా చేసింది టీచర్. నా కొడుకును గంట లేదా రెండు గంటలు హింసించారు. అతను భయపడుతున్నాడు’ అని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు, తన కొడుకును ఇకపై ఆ స్కూల్‌కు పంపబోనని చెప్పాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com