తిరుపతి తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో 7వ మైల్ వద్ద మరో చిరుత సంచరించిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల ద్వారా అటవీ అధికారులు గుర్తించారు. చిరుతను బంధించేందుకు 10 రోజులుగా శ్రమించారు. ఎట్టకేలకు ఈరోజు ఉదయం చిరుత బోన్లో చిక్కింది. అలాగే నడకమార్గంలో సంచరిస్తున్న ఎలుగుబంటిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు యత్నిస్తున్నారు. 15రోజులుగా ప్రయత్నిస్తున్న ఎలుగుబంటి చిక్కడంలేదు. కాగా ఈ చిరుతతో కలిపి మొత్తంగా ఇప్పటివరకు నాలుగు చిరుతలను పట్టుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.