రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఇసుక దోపీడీ చేస్తున్నారని ఆరోపిస్తూ ఇసుక దోపిడీపై 28,29,30 తేదీలలో టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడుతోంది. సోమవారం నాడు ఇసుక రీచ్ ల వద్ద టీడీపీ సత్యగ్రహా దీక్షకు దిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆంక్షలు విధించారు. కొన్ని చోట్ల టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ లు కూడా చేశారు. గుంటూరులో పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ను గృహ నిర్బంధం చేశారు పోలీసులు. కోనూరు ఇసుక రీచ్ వద్దకు వెళ్లకుండా ఆయన్ను గృహ నిర్బంధం చేశారు. కాగా.. ఉద్ధండరాయినిపాలెంలో ఇవాళ ఆందోళన చేయాలని తాడికొండ టీడీపీ నేతలు భావించారు.