జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని గవర్నర్‌పేట స్వాతంత్య్ర సమరయోధులు భవనంలో క్యూ లెవల్ కరాటే బెల్ట్ టెస్ట్ పోటీలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఏఐఎంఈఈ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు పొట్లూరి అన్య, పొట్లూరి అర్జున్ బ్రౌన్‌లు బెల్ట్ 2 క్యూలను సాధించారు. సీహెచ్ స్నిగ్థ, వీ నాగవెంకటేష్, రిమాష్ గౌరవ్ జూనియర్ రెడ్ 9 క్యూను, ఎస్.అక్షితారె డ్డి, సీహెచ్. గోవర్థన్‌రెడ్డి, సీహెచ్.జయనందన్ ఎల్లో 8 క్యూ సాధించగా, ఎన్‌డీఆర్‌ఎఫ్ డోజో విద్యార్థులు పేరాల ఆషిష్ వెంకట్, పేరాల స్నేహ పుష్ప బ్రౌన్ 3 క్యూ, మహ్మద్ అయాన్, మహ్మద్ అకీబ్, ఎం.నికిలా, వీ సాయి శరణ్ జూనియర్ రెడ్ 9 క్యూను సాధించారు. తండ్రి కొడుకులైన చెన్నారెడ్డి ప్రదీ్‌పకుమార్ బ్రౌన్‌బెల్ట్ రెండో క్యూ చెన్నారెడ్డి చయాంక్ ప్రద్యుమున్ ఎల్లో బెల్ట్ 8 క్యూను సాధించారు. ఈ కరాటే బెల్ట్ పోటీలకు ముఖ్య అతిథిగా ఎన్డీఆర్‌ఎఫ్ డిప్యూటీ కమాండర్ ఎస్‌హెచ్ జఫ్రిల్ ఇస్లాం విచ్చేసి మాట్లాడారు. బెల్ట్ టెస్ట్ నిర్వహించిన జపాన్ కరాటే అసోసియేషన్ ఏపీ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ కొడాలి రవిబాబు, జోనల్ ఇన్‌స్ట్రక్టర్ సాగరిక, ఇన్‌స్ట్రక్టర్ ఓ తిరుపతిరావును అభినందించారు.