పాఠశాలలో తరగతి గదిలో సెల్ ఫోన్లను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని, ఇదే సందర్భంలో సెల్ ఫోన్ ద్వారా ఉపయోగించాల్సిన యాప్ లను రద్దుచేసి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటుందా ఆని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయకుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. బద్వేలు లోని స్థానిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన యుటిఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.