శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఆలయం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల సమయంలో తొమ్మిది రోజుల పాటు సిపారస్సు లేఖలు స్వీకరించబోమని తెలిపారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. అధిక మాసం నేపథ్యంలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాలు సందర్భంగా సెప్టెంబర్ 18న రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలను సమర్పిస్తారన్నారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు తరలిరావాలన్నారు. భద్రతా సిబ్బంది నివేదిక మేరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాల అనుమతిపై నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.