కడప జిల్లా, ప్రొద్దుటూరు పురపాలకశాఖ శానిటరీ ఇన్‌స్పెక్టర్ విధులకు ఆటంకం కల్గించిన కేసులో నేరం రుజువు కావడంతో ఫస్ట్ ఏడీఎం కోర్టు ఇరువురికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు సీఐ ఇబ్రహీం తెలిపారు. 2018 సంవత్సరం మార్చి 3వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో పురపాలక పరిధి రెండో డివిజన్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా విధి నిర్వహణలో భాగంగా ఆంధ్రకేసరి రోడ్డు పెద్దగుంత వద్ద పందులు పట్టుకుని తరలిస్తుండగా కాసారపు చిన్న వెంకటసుబ్బయ్య, అతని తల్లి రమణమ్మలు అడ్డుపడి బెదిరించడంపై అదే రోజు రెండవ పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణ స్థానిక ఫస్ట్ ఏడీఎం కోర్టులో జరుగుతూ వచ్చింది. నేరం రుజువు కావడంతో ఫస్ట్ ఏడీఎం ముద్దాయిలైన వెంకటసుబ్బయ్య, రమణమ్మలకు ఒక్కొక్కరికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు సీఐ ఇబ్రహీం తెలిపారు. ముద్దాయిలను కోర్టు అదేశాలతో కడప సెంట్రల్‌జైలుకు తరలించినట్లు సీఐచెప్పారు.