పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. పాక్ చరిత్రలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.300 మార్కును దాటాయి. ప్రధాని అన్వురుల్ హక్ కకర్ నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం గురువారం సాయంత్రం పెట్రోల్ ధర లీటరుకు రూ.14.91, డీజిల్ లీటరుకు రూ.18.44 మేర పెంచింది. దీంతో పెట్రోల్ ధర రూ.305.36కు, డీజిల్ ధర రూ.311.84ను తాకింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్ర నిరసన తెలిపారు. అధికారులను నిలదీశారు.