వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ కోర్టు విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ కేసులో అవినాష్‌ను సీబీఐ ఏ8గా చేర్చిన విషయం తెలిసిందే. అలాగే 145 పేజీలతో కూడిన మూడో ఛార్జ్‌షీట్‌ను కోర్టులో సీబీఐ దాఖలు చేసింది. చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ 22వ తేదీకి వాయిదా పడింది.