రాష్ట్రంలోని కౌలు రైతులకు తోడుగా నిలబడే ప్రభుత్వం తమదేనని ఏపీ సీఎం జగన్ అన్నారు. భూమిలేని పేదలకు సైతం తమ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. కౌలు రైతులకు పెట్టుబడి సహాయార్థం తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ లో తొలి విడత నిధుల జమ కార్యక్రమం నిర్వహించారు. కౌలు రైతులకు సంబంధించి, వారితో పాటు దేవాదాయ శాఖ భూములు కౌలు చేసుకుంటున్న రైతులకు 2023-24కు తొలివిడత పెట్టుబడి సాయం రూ.7,500 అందిస్తున్నామని అన్నారు.