తిరుమలలో క్రూరమృగాల కదలికల నేపథ్యంలో భక్తుల భద్రత దృష్య్టా అటవీ అధికారుల సూచన మేరకు అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో 12 ఏళ్ల లోపు పిల్లలను మధ్యాహ్నం 2 గంటల వరకు, పెద్దలను రాత్రి 10 గంటలకు వరకే అనుమతిస్తున్నామని ఈవో ధర్మారెడ్డి వివరించారు. ఘాట్‌రోడ్లలో కూడా ద్విచక్ర వాహనాలను ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే అనుమతిస్తున్నామన్నారు. అయితే ఈ నిబంధనలను సడలించాలని భక్తుల నుంచి విజ్ఞప్తులు అందాయని, వాటిని అటవీశాఖ దృష్టికి తీసుకువెళ్లామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa