చందమామను ముద్దాడిన ఇస్రో, సూర్యుడికి చేరువయ్యేందుకు సిద్ధమైంది. భగభగమండే సౌరగోళం రహస్యాలను ఛేదించేందుకు ఆదిత్య-ఎల్1 వ్యోమనౌకను శనివారం ప్రయోగించనుంది. సునాయాసంగా చంద్రయానం చేసిన భారత్‌ను అబ్బురంగా చూసిన ప్రపంచ దేశాలు ఆదిత్య యానాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. చంద్రయాన విజయ స్ఫూర్తితో ఇస్రో శాస్త్రవేత్తలు ఆదిత్య విజయం పట్ల కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa