గుంతకల్ డివిజన్‌లో భద్రతా పరమైన పనులు జరుగుతున్న నేపథ్యంలో వయా తిరుపతి మీదుగా విశాఖపట్నం-కడప మధ్య నడిచే తిరుమల ఎక్స్‌ప్రెస్ రైళ్ల గమ్యాన్ని కుదించినట్టు వాల్తేరు సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. విశాఖ నుంచి కడప వెళ్లే 17488 నంబరు గల తిరుమల ఎక్స్‌ప్రెస్ ఈనెల 4, 5, 9 తేదీల్లో తిరుపతి వరకు నడుస్తుందని, తిరుగు ప్రయాణంలో కడప నుంచి బయలుదేరాల్సిన 17487 నంబరు గల ఈ రైలు ఈనెల 5,6,10 తేదీల్లో తిరుపతిలో బయలుదేరి విశాఖ చేరుతుందని పేర్కొన్నారు. తిరుపతి-కడప మధ్య రాకపోకలు తాత్కాలికంగా రద్దు చేసినట్టు ఆయన వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa