హిందూపురం పట్టణం చైతన్య నగర్ లోని ఓ ఉపాధ్యాయిని ఇంటిలో నెలన్నర కిందట జరిగిన దొంగతనం కేసులో నిందితులను ఒకటో పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 3. 5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు పట్టణం రామిరెడ్డినగర్ కు చెందిన రత్నరాజు, చిత్తూరు జిల్లా చౌడేపల్లికి చెందిన సుధాకర్ ఈ దొంగతనం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa