ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి ఈనెల 10 వరకు ఏపీలో పలు ట్రైన్లు రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 03, 2023, 06:21 PM

సౌత్ సెంట్రల్ రైల్వే ఏపీలో పలు ట్రైన్లు పూర్తిగా రద్దు చేసింది. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. నేటి (సెప్టెంబర్ 3) నుంచి ఈ నెల 10 వరకు ఈ ట్రైన్లను రద్దు చేసింది. విజయవాడ సెక్షన్‌లో భద్రతాపరమైన నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. విశాఖ- లింగంపల్లికి వెళ్లే ట్రైన్‌ను నేటి నుంచి 9 వరకు రద్దు చేశారు. లింగంపల్లి- విశాఖపట్టణం వెళ్లే ట్రైన్ ఈనెల 4 నుంచి 10 వరకు రద్దు చేశారు. రాయగడ వెళ్లే ట్రైన్ ఈనెల 3 నుంచి 9 వరకు రద్దు చేశారు.. రైలు 17244 రాయగడ నుంచి గుంటూరు వెళ్లే రైలును ఈనెల 4నుంచి 10 వరకు రద్దు చేసారు. విజయవాడ -విశాఖపట్టణం రైలు అనకాపల్లి వరకు మాత్రమే వెళ్తుంది. విశాఖపట్టణం -విజయవాడ వెళ్లాల్సిన ట్రైన్ అనకాపల్లి నుంచి బయలుదేరుతుంది. ఈవిధంగా ఈనెల 3 నుంచి 10వ తేదీ వరకూ కొనసాగిస్తారు. తిరుపతి -విశాఖపట్టణం వెళ్లాల్సిన రైలు ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు సామర్లకోట వరకూ మాత్రమే వెళ్తుంది.


విశాఖపట్నం -తిరుపతి వెళ్లే ట్రైన్ ఈనెల 7 నుంచి 9 వరకు సామర్లకోట నుంచి బయలుదేరుతుంది. విశాఖపట్టణం, సామర్లకోట మధ్యలో ఈ రైలు నడవదని రైల్వే అధికారులు వెల్లడించారు. మచిలీపట్నం - విశాఖపట్టణం వెళ్లే ట్రైన్ ఈనెల 4 నుంచి 9వ తేదీ వరకు రద్దు చేశారు. విశాఖపట్టణం -మచిలీపట్టణం వెళ్లే ట్రైన్ ఈనెల 5 నుంచి 10 వరకు రద్దు చేశారు. అయితే నరసాపురం నుంచి రాత్రి 11 గంటలకు భీమవరం వెళ్లే విశాఖ లింకు ఎక్స్‌ప్రెస్‌ యథావిధిగా నడుస్తుందన్నారు. నరసాపురం -గుంటూరు వెళ్లే ఫాస్ట్‌ ప్యాసింజర్‌ ఎక్స్‌ప్రెస్‌ సోమవారం నుంచి 10వ తేదీ వరకు రామవరప్పాడు వరకే నడుస్తుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa