దివంగత కాంగ్రెస్ దళిత నేత, కోనేరు రంగారావు మనవరాలైన డాక్టర్ కోనేరు సత్యప్రియ తిరువూరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న తరుణంలో నాలుగు రోజుల క్రితం వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. ఆ సమయంలో ఆమె ఇంటిలోపలి మెట్లపై కూర్చొని ఉండగా సుబ్బారెడ్డి కుర్చీలో కాలుపై కాలు వేసుకుని కూర్చొని ఉన్నారు. దళితులకు వైసీపీ నేతలు ఇచ్చే గౌరవం ఇదేనా? అన్న ప్రశ్నతో ఈ ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంటికి వచ్చిన దళిత నాయకురాలికి కనీస గౌరవం ఇవ్వకుండా అవమానించడం ఏమిటని దళిత నాయకులు ప్రశ్నిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa