విజయనగరం జిల్లా, చీపురుపల్లి లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈనెల 6న చిన్నారులకు రాధా, కృష్ట వేషధారణ పోటీలు నిర్వహిస్తున్నట్టు బ్రహ్మకుమారీల కేంద్రం ఇన్‌చార్జి బీకే శాంతి అక్కయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఐదేళ్ల లోపు వయసు గల పిల్లలు జూనియర్ విభాగంలోను, 6 నుంచి 10 సంవత్సరాల పిల్లలు సీనియర్ విభాగంలోను పోటీకి అర్హులని ఆమె తెలిపారు. వేర్వేరు విభాగాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన వారికి బహుమతులు ఉంటాయన్నారు. బ్రహ్మకుమారీల కేంద్రంలో 6న సాయంత్రం 5.30 నుంచి ఈ పోటీలు ప్రారం భమవుతాయని, ఆసక్తి ఉన్నవారు తమ పేర్లను 5వ తేదీలోగా నమోదు చేసు కోవాలన్నారు. పూర్తి వివరాల కోసం 9000108721, 8309974599, 958172 2360 నెంబర్లకు సంప్రదించాలని అక్కయ్య సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa