ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెంచిన నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 04, 2023, 02:16 PM

పెంచిన నిత్యవసర ధరలను వెంటనే తగ్గించాలని పల్నాడు జిల్లా సిపిఎం నాయకులు గోపాలరావు డిమాండ్ చేశారు. సోమవారం పిడుగురాళ్ల తాసిల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడిపై మోయలేని భారాన్ని వేసి ఇబ్బందులు గురిచేస్తుందని గోపాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని పిడుగురాళ్ల తాసిల్దార్ చక్రవర్తికి సిపిఎం నాయకులు అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa