రాష్ట్ర వక్ఫ్‌బోర్డు పరిపాలనాధికారిగా మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఇంతియాజ్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి హోదాలోనే వక్ఫ్ బోర్డు రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించాలని హైకోర్టు నిర్దేశించడంతో ఈ మేరకు మైనార్టీ సంక్షేమశాఖ గెజిట్ జారీ చేసింది. వక్ఫ్‌బోర్డు నియామకం అయ్యే వరకు రోజువారి కార్యకలాపాలను పర్యవేక్షించాలని పేర్కొంది. అయితే, వక్ఫ్‌బోర్డు పాలసీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఆయనకు లేదని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa