ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్యావరణ రక్షణ మనందరి బాధ్యత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 05, 2023, 01:18 PM

విజయవాడ నగరంలో స్వచ్ఛమైన గాలి, నీలి ఆకాశమే లక్ష్యమని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈనెల 7న ఉదయం 6.30 గంటలకు సైకిల్‌ థాన్‌-వాక్‌ థాన్‌ కార్యక్రమాన్ని ఈట్‌ స్ర్టీట్‌ నుంచి బెంజ్‌సర్కిల్‌ వరకు నిర్వహిస్తున్నామని విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. కాలి నడకన, సైకిళ్లతో నిర్వహించే ఈ కార్యక్రమంలో నగర పరిసర ప్రాంతాల ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈనెల 7న ‘4వ అంతర్జాతీయ నీలి ఆకాశం స్వచ్ఛమైన గాలి దినోత్సవం’ సందర్భంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలియజేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa