రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నెల ఎనిమిదో తేదీన విశాఖపట్నం నగరానికి రానున్నారు. తొమ్మిదో తేదీన ఏయూ కాన్వొకేషన్ హాల్లో నిర్వహించనున్న స్నాతకోత్సవంతోపాటు ఆర్టీఐ కమిషనర్ల జాతీయ సదస్సులో గవర్నర్ పాల్గొని ప్రసంగించనున్నారు. పదో తేదీన ఆయన అరకులోయ వెళ్లనున్నారు. ట్రైబల్ మ్యూజియం, పద్మాపురం గార్డెన్, పెదలబుడు గిరిదర్శిని, సుంకరమెట్ట కాఫీ తోటలను ఆయన సందర్శించనున్నారు.