ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి చంద్రబాబు పర్యటన వివరాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 07, 2023, 05:38 PM

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి 9 గంటలకు బనగానపల్లెకు చేరుకుంటారు. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి ఇంట్లో బస చేస్తారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు పర్యటన, బస ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా గుత్తిలో నిర్వహించాక బనగానపల్లెకు వస్తారు. బీసీ జనార్దన్‌రెడ్డి ఇంట్లో రాత్రి బస ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబునాయుడు రాక సందర్భంగా డోన్‌ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి బనగానపల్లె సీఐ తిమ్మారెడ్డి, ఎస్‌ఐ రామిరెడ్డి, నందివర్గం ఎస్‌ఐ రామాంజనేయరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డితో కలిసి సెక్యూరిటీ, పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సెక్యూరిటీలో భాగంగా బీసీ గుర్రెడ్డి కాంప్లెక్స్‌ ఆవరణను, బీసీ జనార్దన్‌ రెడ్డి ఇంటి పరిసరాలను డీఎస్పీ, పోలీస్‌ సిబ్బంది స్వయంగా పరిశీలించారు. జడ్‌ క్యాటగిరిలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు బనగానపల్లెకు వస్తున్న సందర్భంగా ఆయన బస చేసే ప్రాంతాలను, చుట్టూ పక్కల పరిసరాలను డోన్‌ డీఎస్పీ తన సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 7న గురువారం రాత్రి బనగానపల్లెకు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తన ఇంట్లో బస చేయనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. నారా చంద్రబాబునాయుడు, సిబ్బందికి భోజన వసతి ఇతర ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. టీడీపీకి చెందిన ప్రత్యేక పరిశీలకులు కృష్ణ ఆధ్వర్యంలో చంద్రబాబు బస చేసే ప్రాంతాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించారు. రాత్రి బస చేసిన అనంతరం 8వ తేదీ శుక్రవారం ఉదయం 10గంటలకు బనగానపల్లె పట్టణంలోని జీఎంఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో వెయ్యి మంది మహిళలతో భవిష్యత్తుకు గ్యారెంటీ సంక్షేమ పథకాల్లో భాగమైన మహాశక్తి పథకంపై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. మహిళలతో చంద్రబాబునాయుడు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భారీ సంఖ్యలో నియోజకవర్గం నుంచి మహిళలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు బీసీ తెలిపారు. బీసీ వెంట నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌గౌడ్‌, డోన్‌ టీడీపీ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి, బనగానపల్లె పట్టణ ఉపసర్పంచ్‌ బురానుద్దీన్‌, గడ్డం నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa