ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడు వాహనాలు ఢీకొన్నాయి... ప్రమాదంలో నలుగురి దుర్మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 08, 2023, 06:17 PM

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడమాలపేట చెక్ పోస్టు దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోగా.. అదే మార్గంలో వస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. చిత్తూరు నుంచి బైక్‌పై వెళ్తున్న ముగ్గురు రోడ్డుపై అడ్డంగా ఉన్న కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు.. పలువురు గాయపడగా వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో వడమాలపేట దగ్గర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కారులో ఉన్నవారు చిత్తూరు నుంచి తిరుపతి వైపు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa