గుంటూరు జిల్లా కాకుమాను మండలం కాకుమాను గ్రామం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో శుక్రవారం ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ. కె ఎఫ్ కెనడీ ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు అక్షరాస్యత ప్రాముఖ్యం వివరించారు. అలానే విద్యార్థులు బాగా చదువుకుని తాము చదువుతున్న పాఠశాలల ను అభివృద్ధి చెయ్యాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శ్రీరామ ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa