ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీ మారకపోతే మనుషులను చంపేస్తారా,,,,చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 08, 2023, 09:48 PM

పార్టీ మారకపోతే మనుషులను చంపేస్తారా అని వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహంవ్యక్తంచేశారు. 


 కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో నాగరాజు అనే టీడీపీ కార్యకర్త దారుణ రీతిలో హత్యకు గురయ్యాడు. నాగరాజు స్వస్థలం లింగాల మండలం అంబకపల్లె. పొలంలో పనిచేసుకుంటున్న నాగరాజును వేటకొడవళ్లతో నరికి చంపారు. పార్టీ మారాలని కొన్నిరోజులుగా వేధిస్తున్నారని నాగరాజు కుటుంబ సభ్యులు వాపోయారు. ఇటీవల చంద్రబాబు పులివెందుల వచ్చినప్పుడు నాగరాజు టపాసులు పేల్చాడని, దాంతో అతడిపై కక్షగట్టారని ఆరోపించారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, హతుడు నాగరాజు కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ ద్వారా పరామర్శించారు. సీఎం జగన్ సొంత నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త హత్యకు గురికావడాన్ని ఆయన ఖండించారు. నాగరాజు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నాగరాజు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీ హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని మండిపడ్డారు. పార్టీ మారకపోతే మనుషులను చంపేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగరాజును హత్య చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హత్యా స్థలాన్ని పులివెందుల టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి పరిశీలించారు. నాగరాజు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com