ఈ నెల 12వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 12న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వహించనున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శుద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్న క్రమంలో ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో 11వ తేదీన ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa