ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాబు అహంకారానికి కోర్టు తీర్పు చెంపపెట్టు....కొడాలి నాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 10, 2023, 08:55 PM

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందిచారు. తనను ఎవరూ ఏం చేయలేరనుకుంటున్న చంద్రబాబు అహంకారానికి.. కోర్టు తీర్పు చెంపపెట్టని అభివర్ణించారు నాని. ఈరోజు ఎన్టీఆర్ ఆత్మ శాంతించిన రోజని.. ప్రపంచంలోని ఎన్టీఆర్ విగ్రహాల నుంచి ఆనందభాష్పాలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. లక్షల మంది పిల్లల సొమ్మును ఇష్టానుసారంగా దోచుకున్న చంద్రబాబు... లోకేష్‌కు దారా దత్తం చేశాడన్నారు. తనలోని దొంగ స్కిల్స్ అన్నీ ఉపయోగించి.. స్కిల్ డెవలప్‌మెంట్ సొమ్మును చంద్రబాబు దోచుకున్నారని ఆరోపించారు.


చంద్రబాబును జైలుకు ఈడ్చుకెళ్తున్న విషయాన్ని.. లోకేష్ తన రెడ్ బుక్‌లో రాసుకోవాలంటూ కొడాలి నాని సూచించారు. సాక్ష్యాలతో సహా చంద్రబాబుని పట్టుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని.. ఎన్టీఆర్, వైయస్సార్ అభిమానిగా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కొడాలి నాని తెలిపారు. 74 ఏళ్ల వయసులో ఎన్టీఆర్‌ను క్షోభ పెట్టిన చంద్రబాబు.. తన పాపం పండి మళ్లీ అదే వయసులో జైలుకు వెళ్తున్నాడని నాని గుర్తు చేశారు. ఎంగిలి మెతుకులకు ఆశపడిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు.. నాడు తండ్రిని క్షోభ పెట్టిన చంద్రబాబు కాళ్ల వద్దకే మళ్లీ చేరారని నాని విమర్శించారు. దేవుడు ముందు ఎవరు తప్పించుకోలేరన్నది చంద్రబాబు విషయంలో నిరూపితమైందని కొడాలి నాని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి సింపతి వస్తుందని కూడా ఆలోచించకుండా.. అవినీతిపరుడైన చంద్రబాబు మీద సీఎం జగన్ దర్యాప్తు చేయించారని తెలిపారు. అవినీతి ఎవరు చేసిన ఉక్కు పాదంతో అణిచివేస్తానంటూ సీఎం జగన్ నిరూపించారని కొడాలి నాని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com