చంద్రబాబు కడిగిన ముత్యం కాదు.. అవినీతిలో కూరుకుపోయిన ముత్యం, అవినీతి బురదలో మునిగిపోయిన ముత్యం అని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు పేరు చెబితే స్కీమ్‌లు కాదు.. స్కామ్‌లే గుర్తుకు వస్తాయన్నారు. స్కిల్ స్కామ్‌ను చాలా స్కిల్డ్ క్రిమినల్‌గా దోచుకున్నాడన్నారు. స్కామ్‌లు చేయడం, వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడం, స్టేలు తెచ్చుకోవడం వల్ల తాను చేసిన అవినీతి కేసుల్లో ఇన్నాళ్లూ చంద్రబాబు తప్పించుకుంటూనే వస్తున్నాడని, కానీ ఈరోజు రాష్ట్రంలో నిజాయితీగా పనిచేస్తున్న వైయస్ జగన్ ప్రభుత్వంలో అది కుదరలేదన్నారు. ప్రజాధనాన్ని లూటీ చేసి సాక్షాధారాలతో సహా దొరికిపోయిన తరువాత రాజకీయ కక్ష సాధింపు అంటూ ఎల్లో మీడియా, టీడీపీ నేతలు, దత్త, ఉత్త పుత్రులు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.