చంద్రబాబు అరెస్టు, అక్రమ అరెస్టు కాబట్టే జాతీయస్థాయి నాయకులు స్పందించారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. జగన్ నుంచి 42 వేల కోట్ల రూపాయలు ఆస్తులను ఈడీ జప్తు చేసిందని.. తనను దొంగ అని జైలుకు పంపించారని జగన్ కక్ష పెంచుకున్నారని మండిపడ్డారు. తన ప్రత్యర్థి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని జగన్ కుట్ర చేశారని విమర్శించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి లేదని సంస్థ ఛైర్మన్ ఓపెన్‌గా ప్రకటించారన్నారు. ఆడిటర్లు ఎవరు వచ్చినా తాను చర్చకు రెడీ అని చెప్పారన్నారు.