అఖిల భారత్ ఖేత్ మజ్దూర్ కిసాన్ సభ (ఏఐకేఎంకేఎస్) ఆధ్వర్యంలో మంగళవారం విశాఖపట్నంలో అఖిల భారత ఆదివాసీల బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంకేఎస్ కో-కన్వీనర్ ఝూన్సీ మాట్లాడుతూ..... గత 15 ఏళ్లలో దేశవ్యాప్తంగా 7.5 లక్షల అటవీ భూములను పాలకులు ఇతర అవసరాలకు కేటాయించారన్నారు. మరో తొమ్మిది లక్షల ఎకరాల అటవీ భూములు దురాక్రమణకు గురయ్యాయన్నారు. అడవులను ధ్వంసం చేసి, సామ్రాజ్యవాద కార్పొరేట్‌లకు ఊడిగం చేసే పాలకులే దీనికి కారణమని ఆరోపించారు. అలానే కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన 2023 అటవీ సంరక్షణ చట్టం సవరణ రద్దు చేసే వరకు పోరాడాలని ఒడిశాకు చెందిన ప్రముఖ పర్యావరణ ఉద్యమ నాయకులు ప్రపుల్ల సమంత రాయ్ కోరారు.